Action on Kiran must: T Congress leaders

anjan

T Congress MPs Ponnam Prabhakar, Anjan Kumar Yadav and MLA Komatireddi Venkat Reddy spoke to media this afternoon. They spoke about the recent events in Parliament, the projection of Lagadapati as Seemandhra hero, Kiran’s double standards and on the questions again on Hyderabad. Here is what they said, as it is…

Ponnam Prabhakar:

సీఎంను పదవిలో కొనసాగించడం మంచిది కాదు, పార్టీ బహిష్కరించిన వారితో సీఎం సమావేశం దారుణం, లక్ష్మణరేఖ దాటిన సీఎం కిరణ్పై చర్యలు తీసుకోవాలి, మోదుగుల రాక్షసుడిలా దాడి చేశాడు, ఎంపీలు విధ్వంసం సృష్టించారు, ఇలాంటి వాళ్లపై జీవితకాల నిషేధం విధించాలి,

పెప్పర్ స్ర్పే కొట్టిన లగడపాటిని భగత్సింగ్తో పోలుస్తారా..?
పార్లమెంట్ సాక్షిగా మాపై దాడి జరిగితే, సీమాంధ్ర మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది,
వ్యాపారాలు పెంచుకునేందుకే లగడపాటి నాటకాలు, సీఎం రమేష్, సుజనా చౌదరిని రాజ్యసభ నుంచి, సస్పెండ్ చేయాలని బీజేపీ ఎందుకు కోరడం లేదు, బీజేపీ నేతలు ముందు వాళ్ల స్టాండ్ ఏంటో చెప్పాలి,
తెలంగాణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది, బీజేపీ, టీడీపీ డబుల్ గేమ్ ఆడుతున్నాయి: పొన్నం

Komatireddi Venkata Reddy:
అభినవ అఫ్జల్ గురు లగడపాటి అయితే, అభినవ లాడెన్ సీఎం కిరణ్..
లోక్సభలో బిల్లు పెడితే రాజీనామా చేస్తానన్న సీఎం, ఇంకా ఎందుకు రాజీనామా చేయడం లేదు, సీఎం కిరణ్ మనిషేనా.. ఆయనది నాలుకా, తాటిమట్టా..? కిరణ్ మనిషైతే వెంటనే రాజీనామా చేయాలి,

తెలంగాణ ఆగిపోతే జరిగేది యుద్ధమే, అది ఎలా ఉంటుందో తెలియదు…
సీమాంధ్రలోని రౌడీ షీటర్లందరినీ, ఢిల్లీకి తీసుకెళ్లి విధ్వంసం చేయాలనుకుంటున్నారు, రౌడీలను ఢిల్లీకి తీసుకెళ్తే ఏం లాభం..?
రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేశాక కిరణ్ రాజీనామా చేస్తాడేమో..?
జీవో 15ను జారీచేసి రూ.40 వేల కోట్లు దోచుకునేందుకు కిరణ్ ప్లాన్ వేశాడు

Anjan Kumar Yadav:
హైదరాబాద్ యూటీగీటీ అంటే ఖబర్దార్, మీరేమైనా చేసుకోండి హైదరాబాద్ జోలికి వస్తే ఊరుకోం, మాది బాంబుల సంస్కృతి కాదు, ఏమన్నా ఉంటే ఫేస్ టూ ఫేస్, ఒక్క అవాజ్ ఇస్తే మావాళ్లు కూడా ఢిల్లీకి వస్తారు
సీమాంధ్ర నేతలు ఢిల్లీలో సభ పెట్టాలనుకుంటున్నారు, శాంతియుతంగా సభలు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.