Karimnagar Agriculture

  • వరి, పత్తి, కూరగాయల సాగులో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రాబోయే కాలంలో సాగునీటి వసతులు పెరిగితే.. లక్షల ఎకరాలు భూమి సాగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
  • వ్యవసాయ పరంగా.. కరీంనగర్ జిల్లా… తూర్పుగోదావరి జిల్లాతో పోటీ పడుతూ ముందుకు దూసుకెళుతోంది. వరి ఉత్పత్తిలో ఇప్పటికే ఆ జిల్లాను అధిగమించి.. ముందుకు సాగుతోంది. జిల్లాలోని సారవంతమైన నల్లరేగడి, ఎర్రరేగడి, ఇసుక నేలలు ఆయా పంటలకు అనుకూలంగా ఉన్నాయి. ఓ వైపు వరి, మరోవైపు పత్తితో మిర్చి, వేరుశనగ లాంటి వాణిజ్య పంటలకు జిల్లా ప్రసిద్ధి గాంచింది.
  • ఇప్పటికే జిల్లాలో 7 లక్షల 19 వేల 238 హెక్టార్ల సాగు భూమి ఉంది. జిల్లాలోని వ్యవసాయ భూములకు ఎస్సారెస్పీ, దానికి అనుబంధంగా ఉన్న లోయర్ మానేరు డ్యాం ద్వారా సాగునీరు అందుతున్నాయి.
  • జిల్లాలో4 లక్షల వ్యవసాయ బావులు, బోర్లు ఉన్నాయి. వీటి కింద 72 వేల హెక్టార్ల భూమి సాగవుతోంది.
  • వర్షాధారంగా 3.62 లక్షల హెక్టార్ల లో పంటలు పండుతున్నాయి.
  • ఎస్సారెస్పీ కాలువల కింద 2 లక్షల 20 వేల 910 హెక్టార్లు, అప్పర్ మానేరు కింద లక్షా 62 వేల హెక్టార్లు, లోయర్ మానేరు కింద 58 వేల 910 హెక్టార్లు ఆయకట్టు ఉంది.
  • జిల్లాలోని 4,635 చెరువుల, కుంటల కింద పరోక్షంగా 3 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందుతోంది.
  • వర్షాధారంగా ఏటా 3.62 లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము, అలసంత, కంది వంటి పంటలు పండుతున్నాయి.
  • మానకొండూరు, శంకరపట్నం, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ ప్రాంతాల్లో వరి విత్తనాల ఉత్పత్తికి అనుకూలమైన భూములున్నాయి. ఇక్కడి వరి విత్తనాలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది.
  • ఈ సీడ్స్ కు 6 సంవత్సరాల దాకా నిలువ ఉండే సామార్థ్యం ఉండటంతో విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులను కరీంనగర్ జిల్లా కేంద్రంగా పండించేందుకు ముందుకు వస్తుండటంతో.. ఈ ఏరియాల్లోని రైతులు విత్తన సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారు.
  • భీమదేవరపల్లి మండలంలో ఉన్న ముల్కనూరు పాలడెయిరీ మహిళలే స్వయంగా నిర్వహిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ఇక్కడ మహిళలు నిర్వహించే పాలడైరీ, అనుబంధంగా ఉన్న సహకార బ్యాంకు ఏటా కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది.
  • కరీంనగర్ పద్మనగర్ లో ఉన్న కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల డెయిరీ కూడా ఏటా 100 కోట్ల పై చిలుకు లాభాలను ఆర్జిస్తోంది. ఈ డెయిరీ కింద.. దాదాపు 60 వేల మంది పాడి రైతులు ఉపాధి పొందుతున్నారు.
  • కోనరావుపేట, సిరిసిల్ల ప్రాంతాల్లో పూలసాగు అధికంగా జరుగుతోంది. జిల్లాలోని కోనరావుపేట మండలం మంగళ పల్లి లో రైతులంతా పూలసాగుపైనే ఆధారపడి, ఇతర ప్రాంతాలకు సైతం వాటిని ఎగుమతి చేస్తున్నారు.
  • జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి మండలాలు మామిడి పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇక్కడ పండే మామిడి రకాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది.
  • ఫుడ్ కలర్స్ తయారీకి వాడే మిర్చి ఇక్కడ పండుతుంది.
  • గుట్ట ప్రాంతాలు, మంథని డివిజన్ లోని అటవీ ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులైన జిగురు, ఇప్పపూల వంటి ద్వారా అధిక ఆదాయాలు వస్తున్నాయి.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.