Karimnagar Culture

  • కరీంనగర్ జిల్లాలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు.
  • సంప్రదాయవస్త్రాలైన చీర, ధోవతులే కాకుండా అధునిక దుస్తులు కూడా వేసుకుంటారు.
  • కరీంనగర్ ప్రత్యేకత అయిన బతుకమ్మ పండుగను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.
  • హిందూ పండుగలైన ఉగాది, శ్రీరామనవమి, వినాయకచవితి, హోలి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దసరా, దీపావళి, సంక్రాంతి, మహాశివరాత్రి పండుగలు జరుపుకుంటారు.
  • ఒగ్గుకథ, డప్పు వాయిద్యం, సింధు బాగోతం, గొల్లసుద్దులు, సాధనసురులు వంటి జిల్లా కళాకారులు జాతీయ స్థాయిలో కీర్తి గడించారు.
  • వెండితీగతో నగిషీలు చెక్కే సిల్వర్ ఫిలిగ్రీ కళకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇది కరీంనగర్ జిల్లాలో పుట్టిన అరుదైన కళ.
  • రామడుగులోని శిల్పకారులకు కూడా అంతే స్థాయిలో గుర్తింపు ఉంది.
  • కరీంనగర్ జిల్లా ప్రత్యేక అహారం పిండివంటలలో సకినాలు ఒకటి. సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంలో వీటిని ప్రతి ఇంట చేసుకుంటారు.
  • కరీంనగర్‌లో హిందువుల శాతం 80%, ముస్లిముల శాతం 4%, సిక్కులు 1%. కరీంనగర్ జిల్లా అంతటా అనేక హిందూ ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ఉన్నాయి.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.