Karimnagar History

వేల ఏళ్ల చరిత్ర ఉంది కరీంనగర్ జిల్లాకి చాళుక్యులు, శాతవాహనుల, మొగలాయిలు, కాకతీయులు, నైజాంనవాబుల ఏలుబడిలో విభిన్న రకాల సంస్కృతుల నడుమ మనుగడ సాగించింది కరీంనగర్ జిల్లా.

  • క్రీస్తు పూర్వం 230 నుంచి 220 వరకు శాతవాహనులు ఆ తర్వాత విష్ణుకుండినులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెప్తోంది.
  • క్రీస్తు శకం 543 నుంచి 753 వరకు బాదామీ చాళుక్యులు, 750 నుంచి 973 వరకు వేములవాడ చాళుక్యులు, అ తర్వాత 1159 వరకు కల్యాణీ చాళుక్యులు, ఆ తర్వాత పొలాస రాజులు కరీంనగర్ ను పాలించారు.
  • 1159 నుంచి 1323 వరకు కాకతీయులు, 1518 నుంచి 1687 వరకు కుతుబ్ షాహీలు పాలించగా, ఆ తర్వాత 1724 వరకు ఢిల్లీ మొగలాయి చక్రవర్తులు, వారి తర్వాత.. 1948 వరకు అషాఫ్ జాహీల పాలనలో కరీంనగర్ జిల్లా ఉంది.
  • ఎలగందుల రాజధానిగా ఆసఫ్ జాహీలు ఈ ప్రాంతంలో పాలన సాగించగా, ఆరో నిజాం మీర్ మహాబూబ్ అలీఖాన్ కాలంలో 1905 లో జిల్లా కేంద్రాన్ని ఎలగందుల నుంచి కరీంనగర్ కు మార్చారు.
  • ఆ సమయంలో కోటకు ఖిలేదారుగా కరీంఖాన్ ఉన్నందువల్ల కరీంనగర్ పేరిట జిల్లా కేంద్రానికి పేరు పెట్టారు.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.