Karimnagar Lifestyle

  • కరీంనగర్ జిల్లాలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో జీవన విధానం కనిపిస్తుంటుంది.
  • రామగుండం, కరీంనగర్ ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో.. ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువే. సింగరేణి లో, ఎన్టీపీసీ, బసంత్ నగర్ లాంటి పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది.
  • జిల్లాలోని మరో మూలకు వెళితే.. దుర్భర పరిస్థితులు కనిపిస్తాయి. ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గల్ఫ్, అరబ్ దేశాలకు వెళ్లే యువకుల ధీనగాథలు కనిపిస్తాయి.
  • వ్యవసాయం నడవక, ఉద్యోగాలు దొరక్క ఏజెంట్ల చేతిలో మోసపోయి, ఎడారి దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న ఎందరో యువకుల దీన గాథలు కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, సిరిసిల్ల ప్రాంతాల్లో కనిపిస్తాయి.
  • అయితే.. ఇదే ప్రాంతాల్లో ఎస్సారెస్పీ కాలువల కింద భూములు సాగు చేసే రైతులు, భూస్వాముల పరిస్థిత కాస్త మెరుగ్గా కనిపిస్తుంటుంది.
  • భూమిలేని నిరుపేదలు చాలామంది ముంబాయి, సూరత్, భివాండీలాంటి ప్రాంతాలకు వలస వెళ్లడం కూడా కరీంనగర్ జిల్లాలో సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది.
  • రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది బీడీ కార్మికులుంటే అందులో 75 శాతం తెలంగాణలోనే ఉన్నారు. అందులో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే సుమారు రెండున్నర లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఎక్కువమంది మహిళలు బీడీ పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు.
  • సిరిసిల్లలో వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి జీవనాధారం వస్త్ర పరిశ్రమ కల్పిస్తోంది. సిరిసిల్లలో వేలాదిమంది మరమగ్గాలపై, చేనేతమగ్గాలపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్నారు.
  • రాష్ట్రంలోనే అతిపెద్ద వస్త్రపరిశ్రమగా ప్రసిద్ధిగాంచిన సిరిసిల్లలో 30 వేల మరమగ్గాలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్న దాదాపు 60 వేల మంది కార్మికులున్నారు.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.