Karimnagar Politics

 • కరీంనగర్ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. కానీ, 1952 నుంచి ఇప్పటిదాకా అగ్రవర్ణాలదే రాజకీయాల్లో డామినేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పార్టీల్లో తగిన స్రాధాన్యంలేదు.
 • రాజకీయ పరంగా కరీంనగర్ కు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. జిల్లానుంచి పీవీ నర్సింహరావు దేశ ప్రధానిగా పనిచేస్తే, జి.వెంకటస్వామి, ఎం.సత్యనారాయణ, సింగాపురం రాజేశ్వర్ రావు, సి.హెచ్.విద్యాసాగర్ రావులాంటి నేతలు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు.
 • కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వీటిలో మానకొండూరు, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి.
 • అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కాగా, కరీంనగర్ పార్లమెంటరీ స్థానం జనరల్.
 • ఇవిగాక జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు.. నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలోకి వస్తాయి. అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ రిజర్వుడు కాని స్థానాల్లో ఇప్పటివరకు అత్యధికంగా వెలమ, రెడ్డి కులస్తులే పెద్ద  సంఖ్యలో పోటీచేసి పోటీ చేసి గెలిచిన సందర్భాలున్నాయి.
 • జగిత్యాలలో ఎల్.రమణ, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, కరీంనగర్ పార్లమెంటరీ స్థానంనుంచి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నుంచి ఈటెల రాజేందర్ లాంటి నేతలు ఇప్పుడు బీసీ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు.
 • సమైక్య రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసిన వారిలో ఎక్కువగా అగ్రవర్ణ నేతలే ఉన్నారు.
 • వీరిలోకరీంనగర జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పీవీ నరసింహారావు 1957 నుంచి వరుసగా నాలుగు సార్లు మంథని నుంచి ఎమ్మెల్యే. బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి. ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రారంభించిన పీవీ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎదిగి చివరకు ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించారు. కరీంనగర్ జిల్లా నుంచి అత్యున్నత పీఠమైన ప్రధాన పదవిపై కూర్చున్న ఏకైక తెలుగువానిగా గుర్తింపు పొందారు.
 •  పీవీ కంటే ముందు మంథని ఎమ్మెల్యేగా పనిచేసిన జి. శ్రీరాములు కూడా బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తే.  ఆ తర్వాత శ్రీపాద రావు మూడు సార్లు గెలిచారు. ఈయన కూడా కరణపు బ్రాహ్మణ వర్గీయుడే. ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు.
 • టీడీపీ నుంచి గెలిచిన  చందుపట్ల రాంరెడ్డి అగ్రకులానికి చెందిన వ్యక్తి.
 • వారసత్వ రాజకీయం అందిపుచ్చుకున్న శ్రీపాదరావు కుమారుడైన శ్రీధర్ బాబు  చివరి మూడుసార్లు వరుసగా గెలిచి రాష్ట్ర మంత్రి అయ్యారు.
 • పెద్దపల్లి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలైనవారిని పరిశీలిస్తే గోనె ప్రకాశరావు, గీట్ల ముకుందరెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లంతా అగ్రకులాలకు చెందిన వారే. ఇక్కడి నుంచి బీసీ కులానికి చెందిన బిరుదు రాజమల్లు విజయం సాధించినా ఆ తర్వాతఅగ్రకులాల రాజకీయాలతో ఆయన పోటీపడలేకపోయారు.  జగిత్యాలలో జీవన్ రెడ్డి, కోరుట్లలో జువ్వాడి రత్నాకర్ రావు, సిరిసిల్లలో చెన్నమనేని రాజేశ్వర్ రావు, ఆ తర్వాత కల్వకుంట్ల తారకరామారావు, కరీంనగర్ నుంచి చొక్కారావు, చల్మెడ ఆనందరావు,   హుజురాబాద్ నుంచి దుగ్గిరాల వెంకట్రావు, ముద్దసాని దామోదర్ రెడ్డి, కెప్టెన్ లక్ష్మికాంతరావు, ఎం.సత్యనారాయణ రావు, ఎంపీలుగా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు, జగ్గారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వీళ్ళంతా అగ్రవర్ణాలకు చెందిన వారే. వీరిలోనే చాలా మంది మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా కూడా పనిచేశారు.
  • ఇంతకాలం అగ్రకులాల ఆధిపత్యం ఉన్న జిల్లాలో… ఇప్పుడిప్పుడే బీసీ వర్గానికి చెందిన నేతలు రాజకీయంగా ముందుకు దూసుకెళ్తున్నారు.
  • పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన రామగుండం నియోజకవర్గంలో ఉన్న నాయకత్వమంతా బీసీలే. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సోమారపు సత్యనారాయణతో పాటు వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తోన్న కౌశిక హరి, కోరుకంటి చందర్, గోపు ఐలయ్య యాదవ్ వంటి వారు బీసీలు కాగా, ఠాగూర్ మక్కాన్ సింగ్,బాబర్ సలీం పాషాలాంటి మైనార్టీలు కూడా ఉన్నారు. అదేవిధంగా  మంథని నుంచి పుట్ట మధులాంటి వారు, కోరుట్ల నుంచి డాక్టర్ వెంకట్, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ లాంటి బీసీ నేతలంతా ఇప్పుడు బలమైన నేతలుగా ఎదుగుతున్నారు.
 • తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత.. ఇప్పుడున్న రాజకీయ పార్టీల భవితవ్యం కూడా తారుమరయ్యే అవకాశాలున్నాయి.
 •  ఇప్పటికే టీడీపీ, వైసీపీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి.
 • మరోవైపు సీపీఐ హుస్నాబాద్ లాంటి తమకు పట్టున్న స్థానాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర సాధన అంశాన్ని అస్త్రంగా చేసుకుని జిల్లాలోని  ఒకటి రెండు చోట్ల పాగా వేసేందుకు పావులు కదుపుతోంది.
 • చాపకింద నీరులా ఎం.ఐ.ఎం. కూడా కరీంనగర్, జగిత్యాల లాంటి ప్రాంతాల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది.
 • రామగుండంలో సోమారపు సత్యనారాయణ, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్,  కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సిరిసిల్లలో కేటీఆర్, వేములవాడలో చెన్నమనేని రమేశ్, కరీంనగర్ లో గంగుల కమలాకర్, హుజురాబాద్ నుం ఈటెల రాజేందర్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
 • కాంగ్రెస్ కు ఇప్పుడు మంథని లో శ్రీధర్ బాబు, మానకొండూరు నుంచి ఆరెపల్లి మోహన్, హుస్నాబాద్ లో ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
 • తెలుగుదేశం పార్టీ నుంచి జగిత్యాలలో ఎల్ రమణ, పెద్దపల్లిలో విజయరమణారావు, చొప్పదండి లో సుద్దాల దేవయ్యలు శాసనసభ్యులుగా ఉన్నారు.
Medaram Jathara

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.