Karimnagar Tourism

  • దక్షిణ కాశీ వేములవాడ, నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన.. ధర్మపురి లక్ష్మీనర్సింహ క్షేత్రం, త్రిలింగ క్షేత్రాల్లో ఒక్కటైన కాళేశ్వరం, భక్తుల కొంగుబంగారం కొండగట్టు వంటి పుణ్యక్షేత్రాలున్నాయి. వేములవాడ క్షేత్రం ఏటా 14 కోట్ల ఆదాయంతో ఆంధ్రప్రదేశ్ లోని అత్యధిక ఆదాయం వచ్చే దేవాలయాల్లో ఐదో స్థానాన్ని ఆక్రమించింది. రేపటి తెలంగాణాలో ఈ ఆలయం మొదటి స్థానంలో నిలవనుంది. అదేవిధంగా కొండగట్టు ఆలయం 4 కోట్ల రూపాయలు, ధర్మపురి గుడి 2 కోట్ల రూపాయలు, కాళేశ్వరం దేవాలయం కోటి రూపాయలు, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం 55 లక్షలు, కోరుట్లలోని షిర్డీ సాయి ఆలయం 60లక్షలు, భీమదేవర పల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం 42 లక్షల ఆదాయాన్ని ఏటా దేవాదాయ శాఖకు తెచ్చిపెడుతున్నాయి.
  • ఎలగందుల, రామగిరి, జగిత్యాలవంటి అనేక పురాతన రాజకోటలు, ముచ్చటగొలిపే మానేరు డ్యాంలాంటి ప్లేసులు కూడా ఉన్నాయి.
  • ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం, జమ్మికుంట మండలంలోని ఇల్లందకుంట సీతారామాలాయం, సారంగాపూర్ మండలంలోని పెంబట్ల దుబ్బరాజన్న క్షేత్రం, బెజ్జంకిలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం, నగునూరులోని ప్రసిద్ధ ఆలయాలు, రాయికల్ లోని పంచముఖ లింగేశ్వర త్రికూటాలయం, గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో చాళుక్యుల కాలంలో నిర్మించిన మల్లికార్జున ఆలయం, చాళుక్యుల రాజధానిగా విలాసిల్లిన వెల్గటూరు మండలంలోని కోటిలింగాల, కాకతీయల కాలం నాటి నంది మేడారం, మానకొండూరు మండలంలోని గట్టుదుద్దెనపల్లి దేవాలయం, కొత్తగట్టులోని మత్య్సగిరీంధ్రస్వామి ఆలయం, హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయం, కోరుట్లలోని సాయిబాబా ఆలయం, సుందిళ్ల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, రామగుండం మండలం త్రిలింగేశ్వరాలయం వంటి దర్శనీయ స్థలాలన్నీ టూరిస్టు కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశాలున్నాయి.
  • ఎలగందుల ఖిల్లా, కరపట్నం మండలం మొలంగూరు ఖిల్లా, జగిత్యాలలోని ఖిల్లా, కమాన్ పూర్ మండలంలోని శత్రు దుర్భేద్యమైన రామగిరి ఖిల్లా, సైదాపూర్ మండలంలోని సర్వాయి పాపన్న కోటకట్టి.. గోల్కొండను జయించిన గుట్లు కూడా టూరిస్టు స్పాట్లే.
  • జమ్మికుంట మండలం లోని బిజిగిరి షరీఫ్ దర్గా జిల్లాలో అతి పెద్దది.
  • కరీంనగర్ పాతబజారులోని కరీముల్లాషా దర్గా, ఔరంగజేబు కాలంనాటి ఆరెపల్లి దర్గా వంటివి ఇక్కడ ప్రసిద్ది గాంచాయి.
  • చారిత్రక కట్టడాల్లో కరీంనగర్ లోని టవర్, కమాన్ వంటి చిహ్నాలు కూడా టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి.
  • లోయర్ మానేరు డ్యాం, ఉజ్వల పార్కు, డీర్ పార్కు వంటివి కూడా మంచి టూరిస్టు స్పాట్లే.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.