Projects in Karimnagar

  • ఎప్పుడో నిర్మించిన శ్రీరాంసాగర్, దాని అనుబంధ ప్రాజెక్టులు తప్ప ఇప్పటికీ కొత్తగా కొత్త ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు.
  • గోదావరిపై ఎల్లంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్నా, అది జిల్లా అవసరాలు తీర్చడం అనుమానంగానే ఉంది. నిజానికి ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 21 టీఎంసీలు కాగా.. దీని నుంచి జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తామని ముందుగా చెప్పారు. కానీ.. దీని నుంచి ఇప్పుడు హైదరాబాద్ కు నీరు తరలించాలని నిర్ణయించడంతో.. ఇది మరో సింగూరుగా మారే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సమైక్య పాలకులు ఆడిన కుట్రలో భాగంగా.. గోదావరి బేసిన్ లో ఉన్న ఎల్లంపల్లి నీటిని.. నిబంధనలకు విరుద్ధంగా.. కృష్ణా నది బేసిన్ లో ఉన్న హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
  • ఇక మిడ్ మానేరు, అప్పర్ మానేరుతో పాటు, ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులు ఊరిస్తున్నాయే తప్ప.. అవి ఇంకా అందుబాటులోకి రాలేదు.
  • కరీంనగర్ జిల్లాకు, గోదావరి నదికి విడదీయరాని అనుబంధం ఉఁది. ఇక్కడి ప్రజలు అన్ని రకాల అవసరాలకు గోదావరి నీరే ప్రధాన ఆధారం.
  • నిజామాబాద్ జిల్లా పోచంపాడు గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జిల్లాలోని తాగు, సాగునీటికి ప్రధాన ఆధారం.
  • 90.31 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా జిల్లాకు నీరు అందుతోంది.
  • ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల భూమి సాగవుతోంది.
  • నాలుగు లక్షల ఎకరాల దాకా వ్యవసాయ పంపుసెట్లు, చిన్న నీటి వనరుల ద్వారా సాగవుతున్నాయి. అయితే, ప్రాణహిత చేవెళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తయితే కరీంనగర్ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందే అవకాశం ఉంది. అలాగే, శనిగరం లాంటి ప్రాజెక్టులకు మరమ్మతుల చేస్తే జిల్లాకు మరింత సాగునీరు అందే అవకాశమూ ఉంది. మిగులు జలాలలను వరద కాలువ ద్వారా 2.20 లక్షల ఎకరాల ఎగువ ప్రాంత ఆయకట్టును స్థిరీకరించేందుకు మధ్యమానేరు, గండిపెల్లి, గౌరవెల్లి, తోటపల్లి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.
    • ఎల్లంపల్లి వద్ద నిర్మిస్తున్న శ్రీపాదసాగర్ కింద 2లక్షల ఎకరాలు ప్రతిపాదించారు.
    • రామగుండం మండలం బండలవాగు ప్రాజెక్టు, మంథని కన్నాల ప్రాజెక్టు, మల్హర్ మండలంలోని తీగలవాగు, మల్లాపూర్ మండలంలోని గంగనాల ప్రజెక్టు, ధర్మపురి మండలంలోని అక్కపెల్లి రిజర్వాయర్, జోలి చెరువు, వెల్గటూరు మండలం జంగన్ నాలా, చెగ్యాం ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంతాల్లో పంటలకు నీటిని అందిస్తున్నారు.
    • జిల్లాలో 4,635 చెరువులు, కుంటలు ఉన్నాయి.
    • ల్లాప్రత్యక్షంగా, పరోక్షంగా చెరువులు. కుంటల ద్వారా 3.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
Medaram Jathara