Welcoming Malala Yousafzai to Pune: Spot Light

malala

ఉన్మాదం. ఆటవికత్వం. క్రూరత్వం. సమాజం భరించలేని మృగాల లక్షణాలివి. ఇవన్నీ కలగలిసిన మనుషులు ప్రపంచంలో ఏమూలైనా ఉంటారా ? ఉంటే ఎలా ఉంటారు? ఈప్రశ్నలన్నింటికీ ఏకైక సమాధానం తాలిబాన్లు. ఆఫ్ఘన్లో అంతరించిన తాలిబాన్ల కొత్త కేరాఫ్ అడ్రస్ పాకిస్తాన్ స్వాత్ లోయ. అక్కడ పాలించేది, శాసించేది, రాజ్యమేలేది అన్నీ తాలిబాన్లే. చట్టం, న్యాయం అన్నీ తాలిబాన్ల కనుసన్నల్లోనే. మతం చెప్పే మానవ నీతిని వదిలి.. మతం ముసుగులో సొంత పైత్యం చూపించడమే వారి నీతి. అలాంటివాళ్లతో పోరాడాల్సి వస్తే… వాళ్లను ఢీకొని నిలబడాల్సి వస్తే. మీసాలు మెలేసే మగవాళ్లు చేయలేని పనిని… ఓ ఆడపిల్ల చేసింది. తాలిబాన్లను ఎదురించి పోరాడింది. తూటాలకు కూడా బదులు చెబ్తూ ఎదురు నిలబడింది. ఆ అమ్మాయి పేరే మలాలా యూసఫ్ జాయ్. బ్రేవ్ గాల్. ప్రపంచం మొత్తం తాలిబన్ల ఆగడాలపై ద్రుష్టి పెట్టేలా చేసిన మలాలాపై స్పాట్ లైట్.

మలాలా యూసఫ్ జాయ్. పాకిస్తాన్ స్వాత్ లోయలోని మింగోరా టౌన్ లో నివాసం. వయసు 14 ఏళ్లు.
టీనేజ్ కూడా దాటని ఈ అమ్మాయి తాలిబన్ టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లోకి ఎక్కింది. కాల్చి చంపాల్సినంత ఘోరం ఏం చేసింది ? ఇవే ప్రశ్నలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. దానికికారణం తాలిబన్లకు ఇష్టం లేకుండా చదువుకోవడం, విద్య మన హక్కు అని నినదించడం. ఆ స్పూర్తితో చాలామంది బాలికలు బడిబాట పట్టారు. అందుకే ఆమెపై తాలిబన్ల అటాక్.

2012 అక్టోబర్ 9. మలాలాపై తాలిబాన్లు దాడికి తెగబడ్డ రోజు. మలాలాను హతమార్చాలని తాలిబన్లు డిసైడైన రోజు. సుమారు 50 మంది స్కూల్ పిల్లలతో కలిసి మలాలా స్కూల్ వ్యాన్ లో ప్రయాణిస్తోంది. దారికాచి మరీ ఆమెపై తాలిబాన్ గన్ మెన్ కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ ఆమె తలలోంచి దూసుకెళ్లి వెన్నుపూసను తాకింది. మరోటి మెడలో చిక్కుకుంది.

మలాలాపై దాడిని పాక్ ప్రభుత్వం ఖండించింది. ఆమెను సేవ్ చేసేందుకు వేగంగా స్పందించింది. పెషావర్ లోని మిలటరీ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయించారు. 3 గంటల సర్జరీ తర్వాత వెన్నుపూసలోంచి బుల్లెట్ బయటకు తీశారు. అయినా ఔటాఫ్ డేంజర్ అని చెప్పలేకపోయారు డాక్టర్లు. మలాలా బతకాలని పాక్ ప్రజలంతా రోడ్లపైకొచ్చారు. మహిళలు, విద్యార్థులు, మానవహక్కుల సంఘాలవాళ్లు ర్యాలీలు నిర్వహించారు.

మలాలాపై దాడికి ప్రపంచం మొత్తం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా మలాలాను బతికించేందుకు ఎంతైనా ఖర్చుపెడతామని… ప్రపంచంలోనే అత్యుత్తమ ట్రీట్ మెంట్ కు హామీ ఇచ్చారంటే ఆమెకొచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ మలాలా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఆయనతో పాటు దేశాధినేతలెందరో ఆ అమ్మాయి చావు నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. ట్రీట్ మెంట్ ఇవ్వడానికి ఇంగ్లాండ్ ముందుకొచ్చింది. ఆమెను తరలించేందుకు యూఏఈ రాజకుటుంబం ప్రత్యేకమైన ఫ్లైట్ ఆంబులెన్స్ ని పంపింది. మలాలా బతుకు కోరుతూ ప్రపంచవ్యాప్తంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. మనదేశంలో, మన రాష్ట్రంలోనూ మలాలాకు మద్దతుగా ర్యాలీలు జరిగాయి. ప్రపంచం మొత్తం ఒక్కటై మలాలాకు మద్ధతిస్తున్నా తాలిబన్లు మాత్రం పాత పాటే పాడుతున్నారు. ఆమె బతికి బయటపడ్డా.. మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించారు. ఆమెను మాత్రమే కాదు ఆమె పేరెంట్స్ ని లేపేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ప్రపంచం ద్రుష్టిలో మలాలా ఇపుడో బ్రేవ్ గర్ల్. కానీ తాలిబన్లకు మాత్రం ఆమె ఓ డెవిల్. మూడేళ్లుగా చదువు కోసం ఆమె చేస్తున్న పోరాటమే శాపమైంది. ఆమె తాలిబాన్లకు కంట్లో నలుసులా మారింది. చదువుకోవడం రైటా రాంగా అన్నది పక్కనపెడితే… తాలిబన్లకు టార్గెట్ గా మారేంతగా మాలాలా పాక్ పై చూపిన ప్రభావమే ఇపుడు హాట్ టాపిక్. ఇంతకీ మలాలా ఎవరు. ప్రపంచాన్నే ఆకర్షించేలా ఆమె చేసిన యాక్టివిటీస్ ఏంటి.

ఓ నియంతకు వ్యతిరేకంగానో… లేక ఓ ఘోర ప్రమాదానికో… ఉన్మాదుల దాడికి నిరసనగానో ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం చూశాం. కానీ ప్రపంచం మొత్తం ఒకే అమ్మాయి కోసం ఇలాంటి నిరసనలు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అంతలా ప్రపంచం గుండెను పిండేసింది మలాలా. మలాలా యూసఫ్ జాయ్. 1997 జూలై 12న పాక్ స్వాత్ జిల్లా మింగోలాలో పుట్టింది. తండ్రి జియావుద్దీన్ యూసఫ్ జాయ్. స్వాత్ లోయలో ఆడపిల్లల చదువుల కోసం క్రుషి చేస్తున్న వ్యక్తి. ఆయన ఆదర్శాలతోనే పెరిగింది మలాలా. 2008 సెప్టెంబర్. మలాలా వయసు 11 ఏళ్లు. ఇంకా టీనేజ్ లో అడుగుపెట్టని పసితనం. అప్పుడే చదువు కోసం పోరాటాన్ని మొదలుపెట్టింది. స్వాత్ లోయలోని పరిస్థితులను, అక్కడ తాలిబన్ల అరాచకత్వాన్ని నిరసిస్తూ గళమెత్తింది. రాజ్యంగం తనకిచ్చిన విద్యాహక్కును అడ్డుకోవడానికి తాలిబన్లెవరని పెషావర్ లో ఓ ప్రెస్ క్లబ్ లో నినదించింది. ఆ స్లోగన్ పాక్ ప్రభుత్వాన్ని షేక్ చేసింది. మొదటిసారి తాలిబన్లకు తూటాలా తాకింది. బురఖాలు లేకుండా మహిళలు బయటకు రాకూడదని, అసలు చదువుకోకూడదని ఎనాడో హుకుం జారీ చేశారు తాలిబన్లు. అఫ్ఘనిస్తాన్ తో పాటు తాలిబన్ల ప్రాబల్యమున్న ప్రతీ ప్రాంతంలో అదే జరుగుతోంది. కానీ స్వాత్ లోయలోనూ అదే అరాచకం రాజ్యమేలడమే మలాలాను బ్రేవ్ చైల్డ్ గా తయారయ్యేలా చేసింది. మలాలా ఏడో క్లాస్ చదువుతున్నప్పట్నించే చదువు కోసం పోరాటం మొదలుపెట్టింది. ముస్లిం యువతులు చదువుకోకూడదన్న నిర్ణయానికి అల్లాడిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. అందుకే వాళ్లతో పోరాడేందుకు సిద్ధమైంది. స్కూల్ యూనిఫాం లో వెళ్లకుండా మామూలు డ్రెస్ లో స్కూల్ కెళ్లేది. తనతో పాటు మరికొంత మంది విద్యార్థినులను పోగేసుకుని స్కూల్ కు తీసుకెళ్లేది. ఆమె సంకల్పాన్ని చూసి టీచర్లు చదువు చెప్పేందుకు సిద్ధమయ్యారు.

mal

అప్పటికే తాలిబన్లకు మలాలా స్పిరిట్ ఏంటో అర్థమైపోయింది. ఆమెను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇస్లాంకు వ్యతిరేకంగా చదువుకుంటోందని నిందలేశారు. వెస్ట్రన్ కల్చర్ కు అలవాటు పడిందని విమర్శించారు. అలాంటి అమ్మాయిలను చంపేయాలని స్వాత్ లోయలోని జనాన్ని ఎగదోశారు. అయినా ఎవరూ ముందుకురాలేదు. దీంతో రగిలిపోయిన తాలిబన్లు.. స్వాత్ లోయ లోని స్కూళ్లన్నింటినీ బాంబులు పెట్టి పేల్చేశారు. సుమారు 150 స్కూళ్లు నేలమట్టమయ్యాయి. మలాలా సహా అమ్మాయిలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కాస్త అవగాహన పెరిగాక మరింత రాటుదేలింది మలాలా. తాలిబాన్ల ఆకృత్యాలు తగ్గలేదు. వాళ్ల మైండ్ సెట్ లో మార్పు రాలేదు. దీంతో తాలిబన్ల ఆరాచకాలు, వాళ్ల చట్టాలపై ఉర్దూలో డైరీ రాసింది. దానికి గుల్ మకాయ్ అని పేరుపెట్టింది. దీన్నే బీబీసీకి పంపింది. అందులో ఉన్నదున్నట్టుగా బీబీసీ టెలికాస్ట్ చేసింది. ఓ అమ్మాయి చదువు కోసం చేస్తున్న పోరాటం ప్రపంచానికి అర్థమైంది. అప్పట్నించి మలాలా అంటే ఎవరో తెలిసింది.

ముస్లిం అమ్మాయిల చదువు కోసం మలాలా చేస్తున్న క్రుషిని పాక్ తో పాటు చాలా దేశాలు అభినందించాయి. 2011లో పాక్ ప్రభుత్వం నేషనల్ యూత్ పీస్ ప్రైజ్ తో సత్కరించింది. అదే ఏడాది ఇంటర్నెషనల్ పీస్ ప్రైజ్ దక్కించుకుంది. అప్పట్నించి ముస్లిం యువతకు ఆమె రోల్ మోడల్ గా మారింది. స్టూడెంట్ గా కన్నా యూత్ లీడర్ గా మలాలాను ట్రీట్ చేస్తోంది పాక్ యువత. మలాలాపై అటాక్ తో బ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్ ఐక్యరాజ్య సమితిలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. 2015 కల్లా టీనేజ్ పిల్లలెవరూ స్కూల్ కు దూరం కాకుడదని ఆమె తరుపున పిటిషన్ వేశారు. ఐయామ్ మలాలా పేరుతో బ్రౌన్ ఆ పిటిషన్ ను దాఖలు చేయడం విశేషం.

తాలిబాన్… ఈ పదమే ఉన్మాదానికి మారుపేరు. ఆ పేరు వింటేనే… మహిళలు ఒక్క క్షణం వణికే పరిస్థితి. ఏ మతమైనా మంచే చెబుతుంది. మనుషులను ఆటవిక స్థితి నుంచి మనుషులుగా మార్చడానికి… మంచి మార్గంలో నడపడానికే మతం పుట్టింది. తాలిబాన్ డిక్షనరీలో దీనికి అర్థం వేరు. ఏకే-47 తలకు గురిపెట్టి… ఇదే న్యాయం… అంటుంది తాలిబాన్ తత్వం. ఇస్లాం విలువలకే మచ్చతెచ్చేలా… సొంత నిర్వచనాలతో స్వాత్ లోయను గుప్పిట్లో ఉంచుకున్నారు. ఏం చేయలేని అసమర్థత పాక్ ప్రభుత్వానిది. ఇంతకీ తాలిబన్లకు మలాలా ఎందుకు టార్గెట్ అయ్యింది ? అసలు స్వాత్ లోయలో ఏం జరుగుతోంది?

tal

తాలిబాన్ పాలనలో మహిళలపై అకృత్యాలకు అడ్డే లేదు. మహిళలు మనుషుల్లో భాగం అన్న మాటే మరిచిపోయారు. మతంలో లేని సూత్రాలను సృష్టించారు. నీతినియమాల కోసం పెట్టిన నిబంధనలకు కొత్త అర్థాలు చెప్పారు. మహిళలు… పర్దాలో ఉండాలన్నది ఆఫ్ఘన్ పష్తూన్ వాలీ సంప్రదాయం. ఈ సంప్రదాయంలోనే మహిళలు ఉన్నతంగా బతికే వాతావరణాన్ని కల్పిస్తామన్నది తాలిబాన్ల హామీ. కానీ ఆచరణలో జరుగుతున్నది వేరు. మహిళలు ఎక్కడికి వెళ్లినా… బుర్ఖాలోనే వెళ్లాలి. మహిళల ముఖమే… పరాయి పురుషులు నీతి తప్పడానికి మూలకారణం. అలాగే ఎనిమిదేళ్ల వరకే చదువుకోవాలి. ఆ తర్వాత ఆడపిల్లలకు చదువు అక్కర్లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఖురాన్ ఒక్కటే చదువుకోవచ్చు. తాలిబన్ల ఆధీనంలో చాలా ప్రాంతాల్లో ఇవే రూల్స్. వాటిని క్రాస్ చేస్తే ప్రాణాలు తీయడమే ఫైనల్ జడ్జిమెంట్. పాకిస్థాన్ స్వాత్ లోయ చాలా ఏళ్లుగా తాలిబన్ల చెరలోనే ఉంది. అక్కడ నడిచేది తాలిబన్ రాజ్యమే. లోయలో ఎప్పుడూ అలజడే. ఎప్పుడు బాంబులు పేల్తాయో తెలీదు. ఎంతమంది బాడీలు ఛిద్రమవుతాయో అస్సలు ఊహకందదు. అసలక్కడ జీవితం దినదిన గండం. మహిళల బతుకులు మరీ దుర్భరం.
తాలిబన్ల పాలనలో 80 శాతం బాల్య వివాహాలే. 16 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేసేయాలి. మహిళలను మనుషులుగా కంటే… సొంత ఆస్తులుగా ఫీలయ్యే సంస్క్రుతి రాజ్యమేలుతోంది. హైహీల్స్ వేసుకోకూడదు. పబ్లిక్ ప్లేసుల్లో మాట్లాడకూడదు. ఫోటోలు తీయకూడదు. తీసినా బుర్ఖాల్లోనే కనిపించాలి. అలా కనిపించినా.. పేపర్లు, టీవీ ఛానెళ్లకు ఎక్కకూడదు. మహిళలను కంట్రోల్ చేస్తూ తాలిబన్లు విధించే రూల్స్ కు అడ్డే లేదు. తాలిబన్ రూల్స్ ను ముస్లిం సమాజమూ వ్యతిరేకిస్తుంది. కానీ వాళ్లపై గొంతెత్తితే ప్రాణాలు గాల్లో కలుస్తాయన్న భయం. అందుకే మౌనంగా బతుకుతుంటారు స్వాత్ లోయలోని పాకిస్తానీయులు. పాక్ కు, అఫ్ఘనిస్తాన్ కు బోర్డర్ కావడంతో స్వాత్ లోయ తాలిబన్లకు అడ్డాగా మారింది. స్వాత్ లోయ తాలిబన్ల ఆధీనంలో ఉన్నా పాక్ పట్టించుకోదు. తాలిబన్లను పాకిస్తానే ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలూ ఉన్నాయి.
తాలిబన్లను జనం అసహ్యించుకుంటున్నారు. మతం పేరుతో చేస్తున్న అరాచకత్వానికి రగిలిపోతున్నారు. మలాలాపై దాడి జరగకముందు నుంచే తాలిబన్ల క్రూరత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మలాలాపై దాడితో అవి మరింత ఎక్కువయ్యాయి. ముస్లిం దేశాల్లోనే కాదు… ప్రపంచ వ్యాప్తంగా తాలిబన్లపై నిరసన గళాలు పెరిగిపోయాయి. అసలు తాలిబన్లకు ఏం కావాలి ? మానవత్వం లేని మృగాల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మనిషి మ్రుగంగా మారితే మతాలతో పనేముంటుంది. ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలు… చెప్పే నీతిని, విలువలను వక్రీకరించి వాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు తాలిబాన్లు. మతం చెప్పేదొకటి. వాళ్లు చేసేదింకొకటి. అందుకే తాలిబన్లను ముస్లిం సమాజం అసహ్యించుకుంటోంది. తాలిబాన్ల వల్ల నేరుగానే కాదు… వాళ్లు పెంచిపోషించిన… భావజాలంతో బతికేవాళ్లలో ఎక్కువమంది పురుషులే. తాలిబాన్ల రాతియుగం పోయినా… ఆ ఐడియాలజీతో బతికే వాళ్లతోనే మహిళలకు సమస్యలు. అందుకే నాటి పీడకలల మహిళలను వెంటాడుతూనే ఉన్నాయి. అంతేకాదు అక్రమ సంబంధం పేరుతో ఓ మహిళపై నిందమోపి.. రీసెంట్ గా అందరి ముందు కాల్చి చంపిన ఘటన వెలుగులోకొచ్చింది. మహిళలపై తాలిబన్లు అనుసరించే విధానాలకు ఇంతకంటే సజీవ సాక్ష్యాలు అవసరం లేదేమో.

malal

మలాలా పదహారేళ్ళ లేత వయసులోనే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. UNO లో ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించింది. రష్యా వారి సఖరోవ్ బుమానాన్ని పొందింది. కెనడా వారు ఆనరరీ సిటిజన్ షిప్ ఇచ్చారు. రెండు రోజుల్లో… జనవరి 10 నాడు బర్మా శాంతి పతాక అంగ సాన్ సూ కీ తో కలిసి పూనా రానున్న మలాలా కు ఆహ్వానం పలుకుతూ….

Medaram Jathara